వావ్‌.. ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌

ABN , First Publish Date - 2020-05-18T09:48:47+05:30 IST

సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తా, ఇక్బాల్‌మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెన్‌ సుందరీకరణ పనులు వావ్‌..అనిపించేలా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు ..

వావ్‌.. ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌

సిద్దిపేట టౌన్‌, మే17:  సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తా, ఇక్బాల్‌మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెన్‌ సుందరీకరణ పనులు వావ్‌..అనిపించేలా  ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు.  సిద్దిపేటలో ఆదివారం రాత్రి ముస్తాబాద్‌ చౌరస్తాలోని ఇందిరాగాంధీ సర్కిల్‌, ఇక్బాల్‌ మినార్‌ వద్ద  ఏర్పాటు చేసిన ఫౌంటెన్లను మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ‘సుడా’ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ‘సుడా ప్రత్యేకాధికారి రమణాచారితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ‘సుడా’ నిధులు రూ.10లక్షలతో ఇక్బాల్‌ మినార్‌, రూ.8లక్షల వ్యయంతో ముస్తాబాద్‌ సర్కిల్‌, రూ.22లక్షలతో బాబూ జగ్జీవన్‌రామ్‌ జంక్షన్లు సుందరీకరణ చేసినట్లు వెల్లడించారు. జంక్షన్ల సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ వహించిన ‘సుడా’ ప్రత్యేకాధికారి రమణాచారిని అభినందించారు. ‘‘ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ బ్యూటిఫికేషన్‌ బహుత్‌ అచ్చా.. హైసాబ్‌’’ అంటూ స్థానికులు మంత్రి హరీశ్‌రావుతో కలిసి సెల్ఫీలు దిగారు. 

Updated Date - 2020-05-18T09:48:47+05:30 IST