స్త్రీ నిధి రుణాలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-15T05:37:06+05:30 IST

నారాయణరావుపేట, డిసెంబరు 14 : ఇందిరా క్రాంతి పథంలో మహిళలకు అందిస్తున్న స్త్రీ నిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శాతారాజుపల్లి ఆంజనేయులు అన్నారు. సోమవారం మండలంలోని గుర్రాలగొంది గ్రామంలో మహిళలకు స్త్రీ నిధి రుణాలపై అవగాహన కల్పించారు.

స్త్రీ నిధి రుణాలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
పశువుల హాస్టల్‌పై అవగాహన కల్పిస్తున్న సర్పంచ్‌ ఆంజనేయులు

నారాయణరావుపేట, డిసెంబరు 14 : ఇందిరా క్రాంతి పథంలో మహిళలకు అందిస్తున్న స్త్రీ నిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శాతారాజుపల్లి ఆంజనేయులు అన్నారు. సోమవారం మండలంలోని గుర్రాలగొంది గ్రామంలో మహిళలకు స్త్రీ నిధి రుణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న రుణాలు ఎక్కువ శాతం పాడి గేదెల కొనుగోలుకు తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఏర్పాటు చేస్తున్న పశువుల హాస్టల్‌ గ్రామస్థులకు లాభదాయకమని, పాడి పరిశ్రమతో చాలామంది రైతులు లాభాలను అర్జిస్తున్నారని చెప్పారు. స్త్రీ నిధిలో ఒక్కో మహిళకు రూ.93,554 రుణం అందిస్తామని తెలిపారు. గ్రామంలో పాడి పశువులను తీసుకునేందుకు 85 మంది మహిళలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. స్త్రీ నిధి సిద్దిపేట డివిజన్‌ మేనేజర్‌ మదార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రియాంక, పశు వైద్యాధికారి అభిలాష్‌, ఎంపీటీసీ హరీశ్‌, ఐకేపీ సీసీ భాగ్యలక్ష్మి, వీవోఏలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:37:06+05:30 IST