పురుగుల మందు తాగిన మహిళ మృతి
ABN , First Publish Date - 2020-12-02T05:21:50+05:30 IST
సిద్దిపేట క్రైం, డిసెంబరు 1 : పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.
సిద్దిపేట క్రైం, డిసెంబరు 1 : పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. టూ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన కొమ్మురాజుల ఎల్లవ్వ (50)తో భర్త వెంకటయ్య ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి గొడవపడేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎల్లవ్వ సోమవారం పురుగుల మందు తాగింది. ఇది గమనించిన ఆమె కొడుకులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు రమేష్ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.