బీజేపీలోకి వెళ్లేవారు ఎవరో?
ABN , First Publish Date - 2020-12-14T04:39:21+05:30 IST
నర్సాపూర్, డిసెంబరు 13 : ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి చేరేవారెవరో అనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీలో బీజేపీ సత్తాచాటి ఊపుమీద ఉంది.

నర్సాపూర్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం
నర్సాపూర్, డిసెంబరు 13 : ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి చేరేవారెవరో అనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీలో బీజేపీ సత్తాచాటి ఊపుమీద ఉంది. అంతేకాకుండా ఇతర పార్టీల వారిని పెద్దఎత్తున చేర్చుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. దాంతోపాటు బీజేపీకి రోజురోజుకూ బలం పెరుగుతుండడంతో ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారి చూపు కూడా ఇటువైపు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకోనున్నాయని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎ్‌సలో ప్రస్తుతం అసంతృప్తిలో ఉన్నవారితో పాటు భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా కొందరు బీజేపీ వైపు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన అధికార టీఆర్‌ఎ్‌సలోని కొందరు ముఖ్యమైన నాయకులు కూడా బీజేపీలో చేరుతారంటూ స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండురోజుల క్రితం నర్సాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఈ విషయమై మాట్లాడుతూ కొందరు నాయకులు పాల పొంగును చూసి అటువైపు ఆలోచిస్తున్నారని అనడం చూస్తే బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరుతున్నది. ఇక కాంగ్రెస్ ప్రస్తుతం నాయకత్వ లోపంతో కిందిస్థాయి క్యాడర్ అసంతృప్తిలో ఉన్నది. ఈ పార్టీలోని కొందరు బీజేపీలో చేరాలనే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ నుంచి వెళ్లేవారు ఎవరనే విషయం అందరికీ ఆసక్తిగా మారింది. మరికొన్నిరోజుల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చకు తెరపడనున్నదని చెప్పవచ్చు.