పనులు ప్రారంభమయ్యేదెన్నడు?

ABN , First Publish Date - 2020-11-26T06:33:02+05:30 IST

జూన్‌లో సీఎం కేసీఆర్‌ అర్బన్‌ పార్కు ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా నర్సాపూర్‌ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.25 కోట్లను ప్రకటించారు.

పనులు ప్రారంభమయ్యేదెన్నడు?
నర్సాపూర్‌ మున్సిపల్‌కార్యాలయం

 నర్సాపూర్‌కు సీఎం రూ.25 కోట్ల ప్రకటన

 ఆశతో ఎదురు చూస్తున్న స్థానికులు


నర్సాపూర్‌, నవంబరు 25: జూన్‌లో సీఎం కేసీఆర్‌ అర్బన్‌ పార్కు ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా నర్సాపూర్‌ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.25 కోట్లను ప్రకటించారు. ఆ నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో ఏఏ పనులు చేపట్టాలని అధికారలుఉ నిర్ణయించారు. నర్సాపూర్‌ మున్సిపల్‌ భవన నిర్మాణానికి రూ.కోటి కేటాయించారు. నర్సాపూర్‌ పాత తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో శాశ్వత ఆధునిక సమీకృత మార్కెట్‌ను నిర్మించాలని రూ.4 కోట్లు కేటాయించారు. స్లాటర్‌హౌస్‌ కోసం రూ.కోటి కేటాయించారు. ఈ మూడు పనులు ముందుగా చేపట్టడానికి టెండరు ప్రక్రియ చేపట్టాలని ఈ మధ్య నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మున్సిపల్‌ పాలకవర్గం తీర్మానం కూడా చేసింది. సీఎం ప్రకటించిన నిధులతో గౌడ, ఎస్టీ, ఎస్సీ కమ్యునిటీహాళ్ల నిర్మాణానికి రూ.50 లక్షల చొప్పున కేటాయించారు. ముదిరాజ్‌ కమ్యునిటీహాల్‌కు రూ.60 లక్షలు, గ్రంథాలయ నిర్మాణానికి రూ.40 లక్షలు, ముస్లిం శ్మశానవాటికకు రూ.20 లక్షలు, జగన్నాథరావుకాలనీలో ఎస్సీ, బీసీలకు శ్మశానవాటికల కోసం రూ.20 లక్షలు, 12వ వార్డులో శ్మశానవాటిక కోసం రూ.15 లక్షలు, నూతన పార్కు ఏర్పాటుకు కోటి రూపాయలు, నర్సాపూర్‌ ప్రధాన శ్మశానవాటిక, ప్రహరీ నిర్మాణానికి రూ.కోటి, నాలుగు మహిళా సమాఖ్య భవనాలకు రూ.15 లక్షల చొప్పున 60 లక్షలు, స్టేడియం కోసం రూ.రెండుకోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రూ.10.75 కోట్లను సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి కేటాయించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పనిని కూడా ప్రారంభించకపోవడంతో స్థానికులు నిరాశలో ఉన్నారు. పనలు త్వరగా ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా తమకు కమ్యునిటీహాల్‌ నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తి కొన్ని వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-11-26T06:33:02+05:30 IST