భూమేష్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
ABN , First Publish Date - 2020-12-10T05:30:00+05:30 IST
రాయపోల్ గ్రామానికి చెందిన కళాకారుడు భూమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

మంత్రి హరీశ్‌రావు
రాయపోల్, డిసెంబరు 10: రాయపోల్ గ్రామానికి చెందిన కళాకారుడు భూమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. 5 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో భూమేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం రాత్రి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి రాయపోల్‌కు వచ్చి భూమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనవెంట మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, జడ్పీటీసీ యాదగిరి, టీఆర్‌ఎస్ మండల సీనియర్ నాయకులు మోహన్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, అధికారులు ఉన్నారు.