రైతుబంధు దరఖాస్తుకు 20 వరకు అవకాశం
ABN , First Publish Date - 2020-12-17T05:50:41+05:30 IST
సంగారెడ్డి టౌన్, డిసెంబరు 16 : ప్రభుత్వం రైతులకు సాగు పెట్టుబడి కింద అందిస్తున్న రైతుబంధు కోసం కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవడానికి 20 వరకు అవకాశం ఇచ్చిందని కలెక్టర్ హన్మంతరావు తెలిపారు.

కలెక్టర్ హన్మంతరావు
సంగారెడ్డి టౌన్, డిసెంబరు 16 : ప్రభుత్వం రైతులకు సాగు పెట్టుబడి కింద అందిస్తున్న రైతుబంధు కోసం కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవడానికి 20 వరకు అవకాశం ఇచ్చిందని కలెక్టర్ హన్మంతరావు తెలిపారు. రైతుబంధు కింద యాసంగికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు బ్యాంక్ ఖాతా నెంబర్, పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను వ్యవసాయ విస్తరణాధికారికి అందజేయాలన్నారు. 10 వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను రైతుబంధు పోర్టల్‌లో పొందుపరిచామన్నారు. యాసంగిలో అదనంగా 10,251 మంది కొత్త రైతులు రైతుబంధు పొందేందుకు అర్హత కలిగి ఉన్నారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని కలెక్టర్ హన్మంతరావు కోరారు.