గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-11-28T05:23:41+05:30 IST

సదాశివపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సదాశివపేట రూరల్‌, నవంబరు 27: సదాశివపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉన్న స్థితిలో ఉండడంతో మృతుడు ఎవరనేది తెలియలేదు. వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Read more