బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు కలెక్టర్లు

ABN , First Publish Date - 2020-10-27T11:41:01+05:30 IST

సిద్దిపేట కలెక్టర్‌గా భారతి హోలికేరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌ బృందం ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు

బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు కలెక్టర్లు

సంగారెడ్డి కలెక్టర్‌గా వెంకట్రామారెడ్డి నేడు బాధ్యతల స్వీకరణ

పూలు, బొకేలు వద్దు.. పెన్నులు, పుస్తకాలతో రండి : మెదక్‌ కలెక్టర్‌


సిద్దిపేటసిటీ/మెదక్‌ రూరల్‌/సంగారెడ్డి : సిద్దిపేట కలెక్టర్‌గా భారతి హోలికేరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌ బృందం ఆమెకు పుష్పగుచ్ఛం  అందజేసి స్వాగతం పలికారు. అలాగే మెదక్‌ కలెక్టర్‌గా హనుమంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తనను కలిసే వారు బొకేలు, పూలతో కాకుండా పెన్నులు, పుస్తకాలతో రావాలని ఆయన సూచించారు. పుస్తకాలు, పెన్నులు తీసుకొస్తే వాటిని పేద విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుం దని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇక సంగారెడ్డి కలెక్టర్‌గా పి.వెంకట్రామారెడ్డి నియమితులయ్యారు. కలెక్టర్‌గా ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని బదిలీ చేశారు. ఆ ఫలితంగానే మరో రెండు జిల్లాల కలెక్టర్లనూ బదిలీ చేయాల్సి వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ఉపఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్లీ వీరికి స్థానచలనం ఉండొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


Updated Date - 2020-10-27T11:41:01+05:30 IST