దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-09-13T09:34:20+05:30 IST

దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 12: దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ సైదులు శనివారం వెల్లడించారు. చిన్నకోడూరు మండలం గోనేపల్లి గ్రామానికి చెందిన రంజాన్‌ అలీ ఆగస్టు 4న సిద్దిపేట పట్టణం కాళ్లకుంటకాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదేరోజు రాత్రి 10.30 గంటలకు ముస్తాబాద్‌ చౌరస్తా నుంచి నాగదేవత టెంపుల్‌ బైపా్‌సలో తన బైకుపై తిరుగు పయనమయ్యాడు. బైపాస్‌ రోడ్డు చౌరస్తాలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రాంగ్‌ రూట్లో వచ్చి రంజాన్‌అలీని అటకాయించారు.


అతడ్ని కొట్టి అతడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. రంజాన్‌అలీ వన్‌టౌన్‌పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో  సీఐ సైదులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు పరిశోధనలో భాగంగా నాగదేవత టెంపుల్‌, ముస్తాబాద్‌ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని గమనించారు. సిద్దిపేటకు చెందిన మహమ్మద్‌ అమీర్‌, బుగ్గ ప్రణయ్‌లను నిందితులుగా గుర్తించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు నిందితులను వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.5,500, ఒక సెల్‌ఫోన్‌,  బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం జ్యూడీషియల్‌ రిమాండ్‌కు పంపించినట్లు  సీఐ సైదులు, ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-13T09:34:20+05:30 IST