టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం పరిశీలన

ABN , First Publish Date - 2020-07-18T11:19:02+05:30 IST

కంది శివారులో నూతన హంగులతో సర్వాంగా సుందరంగా నిర్మించిన సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం మంత్రి హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం పరిశీలన

కంది, జూలై 17 : కంది శివారులో నూతన హంగులతో సర్వాంగా సుందరంగా నిర్మించిన సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. నూతన భవనంలో కలియతిరిగి పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణం బావుందంటూ భవనాన్ని డిజైన్‌ చేసిన ప్రాజెక్టు మేనేజర్ని మంత్రి సన్మానించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో, కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవనం వద్ద మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎంపీపీ కాల్వ సరళ, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సర్పంచ్‌ విమల , టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T11:19:02+05:30 IST