జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
ABN , First Publish Date - 2020-12-19T06:36:56+05:30 IST
జాతీయరహదారిపై శుక్రవారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది

మనోహరాబాద్, డిసెంబరు 18: జాతీయరహదారిపై శుక్రవారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. మేడ్చల్ వైపు నుంచి వచ్చిన కంటైనర్ లారీ మండలంలోని కాళ్లకల్ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకునే యత్నంలో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. కంటైనర్ భారీగా ఉండడంతో రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో జాతీయరహదారిపై తూప్రాన్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. జాతీయరహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం నెమ్మదిగా రాకపోకలు జరిగాయి. అరగంట తర్వాత కంటైనర్ వెళ్లిపోవడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.