పత్తి విక్రయానికి రైతులకు టోకెన్లు

ABN , First Publish Date - 2020-12-11T05:46:21+05:30 IST

రాయికోడ్‌, డిసెంబరు 10 : జిల్లాలో ఏర్పాటు చేసిన 15 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో 14వ తేదీ నుంచి రైతులకు టోకెన్లను అందజేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు.

పత్తి విక్రయానికి రైతులకు టోకెన్లు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి 

మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాల పరిశీలన

రాయికోడ్‌, డిసెంబరు 10 : జిల్లాలో ఏర్పాటు చేసిన 15 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో 14వ తేదీ నుంచి రైతులకు టోకెన్లను అందజేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. మండలంలోని నాగ్వార్‌ శివారులో సీసీఐ కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని అఖిల (13) మృతిచెందింది. గురువారం పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సీసీఐ కేంద్రంలో ఏఈవోల ద్వారా రైతులకు పత్తి విక్రయానికి టోకెన్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏ రైతు.. ఏ రోజు కొనుగోలు కేంద్రానికి పంటను తేవాలో.. ఆ వివరాలతో టోకెన్లను అందిస్తారని చెప్పారు. రోడ్డుపై ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందన్నారు. రైతులు పండించిన పత్తి పంట మొత్తం కొనుగోలు చేసేంతవరకూ సీసీఐ కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు. పత్తి విక్రయించిన 72 గంటల్లో బిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో కాస్త ఆలస్యమవుతుందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. 

దళారులపై క్రిమినల్‌ కేసులు 

అసలైన రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో దళారులు పత్తి విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేంద్రానికి విచ్చేసిన పలు అనుమానాస్పద పత్తి లారీల వివరాలను తనిఖీ చేశారు. పలు వాహనాలు, రైతులు విక్రయానికి తెచ్చిన వారి వివరాలను తనిఖీ చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఏవో నర్సింహారావు, డీఎంవో చాయాదేవి, ఆర్డీవో రమే్‌షబాబు, తహసీల్దార్‌ రాజయ్య, ఏవో అభిలా్‌షవర్మ, ఆర్‌ఐ ప్రభాకర్‌, మార్కెట్‌ యార్డు కార్యదర్శి సత్యనారాయణ, ఎంపీపీ వెంకట్‌రావు, ఆత్మ చైర్మన్‌ విఠల్‌, రైతులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-11T05:46:21+05:30 IST