కూచన్‌పల్లిలో బైక్‌ను దహనం చేసిన దుండగులు
ABN , First Publish Date - 2020-03-02T11:13:39+05:30 IST
గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను దహనం చేసిన మెదక్ జిల్లా హవేళిఘణపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు

హవేళిఘణపూర్: గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను దహనం చేసిన మెదక్ జిల్లా హవేళిఘణపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన కొజ్జపురం ధీరజ్ తన బైక్‌ను రాత్రి తన ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉంచాడు. ఇంటిలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ దగ్ధమైంది. ఆ మంటలకు ఇల్లు కూడా కొంత మేరకు దగ్ధమైందని ఆయన తెలిపాడు. రాత్రి పోలీసులకు సమాచారం అందించగా వారి వెళ్లి పరిశీలించారు. కాగా, గ్రామంలో ఇప్పటి వరకు ఈ విధంగానే రెండు బైక్‌లను గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు.