అత్యాచార యత్నం కేసులో మూడేళ్ల జైలు
ABN , First Publish Date - 2020-12-30T05:36:47+05:30 IST
బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

గజ్వేల్, డిసెంబరు 29: బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016 ఫిబ్రవరి 5న గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక(17)పై అదే గ్రామానికి తాడూరి అలియాస్ చాకలి లక్ష్మణ్(25) అత్యాచార యత్నం చేశాడు. బాలిక కేకలు విని చుట్టుపక్కల వారు రావడాన్ని గమనించిన నిందితుడు పారిపోయాడు. అప్పట్లో నిందితుడిపై ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ మహబూబ్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సోమవారం వరకు ఈ కేసుపై సంగారెడ్డి రెండవ అడిషనల్ డిస్ట్రిక్ ఫాస్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జె.మైత్రేయి విచారణ చేపట్టారు. నేరం రుజువైనందున నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు.