వనదుర్గామాత సన్నిధిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2020-12-28T04:59:15+05:30 IST

దుర్గామాత నామస్మరణలతో ఏడుపాయల ఆలయ ప్రాంతం మార్మోగింది. ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు.

వనదుర్గామాత సన్నిధిలో భక్తుల సందడి

అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు


పాపన్నపేట, డిసెంబరు 27: దుర్గామాత నామస్మరణలతో ఏడుపాయల ఆలయ ప్రాంతం మార్మోగింది. ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. ఓడిబియ్యం పోసి, బోనాలను నివేదించి మొక్కులను చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్డారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ఆమెను శాలువాతో సన్మానించారు. ఇటీవలె పాపన్నపేట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన బాల్‌కిషన్‌తో పాటు జిల్లా కార్యదర్శి శివచరణ్‌, మండల కార్యదర్శి సుమన్‌ను కూడా ఈవో సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఈవో చర్యలు తీసుకున్నారు. పాపన్నపేట ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును నిర్వహించారు. 


Updated Date - 2020-12-28T04:59:15+05:30 IST