చైతన్యానికి మారుపేరు ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2020-12-31T05:12:38+05:30 IST

ఉపాధ్యాయుడు అంటే చైతన్యానికి మారుపేరు అని, నాలుగు గోడల మధ్య విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా ప్రపంచానికి సత్తా చాటే శక్తిని ప్రసాదించే మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

చైతన్యానికి మారుపేరు ఉపాధ్యాయుడు
ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

చేర్యాల, డిసెంబరు 30 : ఉపాధ్యాయుడు అంటే చైతన్యానికి మారుపేరు అని, నాలుగు గోడల మధ్య విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా ప్రపంచానికి సత్తా చాటే శక్తిని ప్రసాదించే మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈటల సన్నిహితుడైన చేర్యాల ఎంఈవో గుడ్డిపోచగల్ల రాములు ఉద్యోగ విరమణ కార్యక్రమం స్థానిక కల్యాణి గార్డెన్స్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సకల సమస్యల పరిష్కారానికి చదువు ఒక్కటే మార్గమని, చదువు లేని సమాజం అంధకారమయమన్నారు. రాములు చొరవతో ఎన్‌ఆర్‌ఐ సంస్థ సహకారంతో చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలకు అందించిన ఎల్‌ఈడీ టీవీలను మంత్రి, ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అంతకుముందు రెండు మండలాల ఉపాధ్యాయులు, యూనియన్‌ సంఘాల నాయకులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా విద్యాధికారి రవికాంతారావు, చేర్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి, ఎంపీపీలు వుల్లంపల్లి కరుణాకర్‌ , తలారి కీర్తన, జడ్పీటీసీలు శెట్టె మల్లేశం, సిలివేరి సిద్ధప్ప, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:12:38+05:30 IST