రెడ్‌జోన్‌గా పెట్రోల్ పంప్ సమీప కాలనీ
ABN , First Publish Date - 2020-06-22T11:40:55+05:30 IST
చేర్యాల పట్టణంలోని పెట్రోల్‌పంప్ సమీప కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో సంబంధిత ప్రదేశాన్ని రెడ్‌జోన్‌గా మార్చేశారు.

చేర్యాల, జూన్ 21 : చేర్యాల పట్టణంలోని పెట్రోల్‌పంప్ సమీప కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో సంబంధిత ప్రదేశాన్ని రెడ్‌జోన్‌గా మార్చేశారు. ఈమేరకు అధికారులు కాలనీ దారిని మూసివేసి రెడ్‌జోన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆదివారం చేర్యాల ఎస్‌ఐ మోహన్‌బాబు, ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అశ్విని స్వాతి, హెల్త్ ఎడ్యుకేటర్ మురళి, సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి విచారణ చేపట్టారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెదలినవారితో పాటు అతడి సంబంధీకులతో మాట్లాడి వివరా రాలను తెలుసుకున్నారు. ఆయన చికిత్స పొందిన సూర్యనారాయణ క్లినిక్, అక్షయఆస్పత్రి వైద్యులను, ఆయా ఆస్పత్రుల పక్కన ఉన్న మెడికల్ షాపు నిర్వాహకులను హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మెడికల్ దుకాణాలను తెరవకూడదని తెలిపారు. మొత్తంగా 13 మంది ప్రైమరీ కాంటాక్టు, 18 మంది సెకండరీ కాంటాక్టులు, మరో 10మంది వరకు ఇతర గ్రామాలకు చెందిన వారిని గుర్తించి వారందరికీ హోంక్వారంటైన్ ముద్ర వేశారు. కాగా 4వవార్డులో ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు వైద్యులు తెలిపారు.