ఇంట్లో నుంచి వెళ్లి తప్పిపోయిన బాలుడు

ABN , First Publish Date - 2020-12-29T05:10:38+05:30 IST

ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు తప్పిపోయిన సంఘటన ఈ నెల 27న సాయంత్రం సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది.

ఇంట్లో నుంచి వెళ్లి తప్పిపోయిన బాలుడు
తప్పిపోయిన బాలుడు చరణ్‌

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 28 : ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు తప్పిపోయిన సంఘటన ఈ నెల 27న సాయంత్రం సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. సంగారెడ్డి పట్టణ సీఐ వెంకటేశ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డిలోని రహమత్‌నగర్‌కు చెందిన పిచ్చకుంట్ల చరణ్‌ (8) ఈ నెల 27న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చరణ్‌ తండ్రి శేఖర్‌ బంధువులు, చుట్ట పక్కల గాలించినా జాడ దొరకకపోవడంతో సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటేశ్‌ తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 08455-276333, 9490617010, 79896 26616 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.Updated Date - 2020-12-29T05:10:38+05:30 IST