నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఖరారు

ABN , First Publish Date - 2020-11-26T06:34:53+05:30 IST

నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం ఖరారు చేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్‌ కాపీని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బుధవారం సాయంత్రం విడుదల చేశారు.

నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఖరారు
అనసూయ

 చైర్‌పర్సన్‌గా అనసూయ, వైస్‌చైర్మన్‌గా హబీబ్‌ఖాన్‌


నర్సాపూర్‌, నవంబరు 25: నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం ఖరారు చేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్‌ కాపీని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బుధవారం సాయంత్రం విడుదల చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నర్సాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ సతీమణి అనసూయ నియామకం కాగా, వైస్‌చైర్మన్‌గా నర్సాపూర్‌కే చెందిన మైనార్టీ నాయకుడు హబీబ్‌ఖాన్‌ ఖరారయ్యారు. డైరెక్టర్లుగా నగేష్‌, నర్సింహులు, విద్యాసాగర్‌, నర్సింహారెడ్డి, రవూఫ్‌, దేవులానాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, జ్ణానేశ్వర్‌ నియామకమయ్యారు. శివ్వంపేట పీఏసీఎస్‌ ఛైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, వ్యవసాయ శాఖ ఏడీఏ, నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీదర్‌యాదవ్‌ సభ్యులుగా ఉంటారు. ఎన్నో ఏళ్లకు దక్కిన పదవి


నర్సాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు అశోక్‌గౌడ్‌ ఉద్యమ సమయం నుంచి పార్టీలో కీలకంగా పనిచేశారు. గతంలోనే నామినేటెడ్‌ పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా పదవి దక్కలేదు. చివరకు ఈ సారి మార్కెట్‌ కమిటీ పదవీ ఆయన భార్యకు దక్కింది. అశోక్‌గౌడ్‌ నర్సాపూర్‌ పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పంచుగా బరిలో నిలుచుని ఓడిపోయారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నో రోజులుగా పార్టీలో ఉన్నా సముచిత స్థానం దక్కలేదన్న నిరాశతో ఉన్న అతడి అనుచర వర్గంలో ఇద్దరికి పదవులు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైస్‌చైర్మన్‌గా నియామకమైన హబీబ్‌ఖాన్‌ కూడా పార్టీలో సీనియర్‌ నాయకుడిగానే ఉన్నారు. అతడికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. మొదటి సారి వైస్‌చైర్మన్‌గా నియామకమయ్యారు.


Updated Date - 2020-11-26T06:34:53+05:30 IST