గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-05-17T10:16:00+05:30 IST
గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్ అధికారులకు

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్
హుస్నాబాద్/సిద్దిపేట టౌన్, మే 16: గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 వేల ఎకరాల్లో విస్తరించిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 1.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని, తోటపల్లి రిజర్వాయర్ సొరంగ మార్గంలో మోటార్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ధేశంమేరకు మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మిడ్‌మానేరు నుంచి నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు గోదావరి జలాలు చేరుకున్నాయని పేర్కొన్నారు. శనిగరం, మహాసముద్రం గండి, సింగరాయ ప్రాజెక్టు, దేవాదుల ఎల్లమ్మ చెరువుల ద్వారా హరిత నియోజకవర్గంగా మారుతుందన్నారు.