అన్ని మతాల పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుంది

ABN , First Publish Date - 2020-12-20T05:16:10+05:30 IST

అన్ని మతాల పండుగలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవిస్తుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.

అన్ని మతాల పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుంది
దోమడుగులో మురుగు కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


రామచంద్రాపురం, డిసెంబరు 19: అన్ని మతాల పండుగలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవిస్తుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్‌, రామచంద్రాపురం డివిజన్లలో క్రైస్తవులకు కార్పొరేటర్లతో కలిసి క్రిస్టమస్‌ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాల ప్రధాన పండుగలకు కానుకలను అందజేస్తూ ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వి.సింధూఆదర్శరెడ్డి, బి.పుష్పనగే్‌షయాదవ్‌, సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పరమే్‌షయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


దోమడుగులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గుమ్మడిదల, డిసెంబరు 19 : పటాన్‌చెరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని దోమడుగు గ్రామంలో రూ.41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు పోతున్నాయన్నారు.  పారిశ్రామికవాడలో పరిశ్రమలు గ్రామాభివృద్ధిలో తన వంతు  సహకారం అందించి మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. బొంతపల్లి మెట్రో పరిశ్రమ, గుమ్మడిదల గ్రామానికి మురుగు కాలువ నిర్మాణానికి లక్షల రూపాయలు నిధులు వెచ్చించి గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ రాజశేఖర్‌, సర్పంచ్‌ స్వరూపరామ్‌రెడ్డి, ఎంపీటీసీ గోవర్దన్‌గౌడ్‌, వార్డుసభ్యులు పుష్పలత, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:16:10+05:30 IST