కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్న సర్కార్‌

ABN , First Publish Date - 2020-12-15T05:57:22+05:30 IST

రైతులను మోసం చేస్తూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి విమర్శించారు.

కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్న సర్కార్‌
సమావేశంలో మాట్లాడుతున్న గోదావరి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 14 : రైతులను మోసం చేస్తూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం     కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో నాయకులు చంద్రశేఖర్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, జగన్‌, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.


పే రివిజన్‌, నిరుద్యోగ భృతి చెల్లించాలి

రామచంద్రాపురం, డిసెంబరు 14: ఉద్యోగులకు పే రివిజన్‌, యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేపీ నాయకులు గోదావరి అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సంగారెడ్డిలో చేపట్టిన దీక్షకు బయలుదేరుతున్న గోదావరి అంజిరెడ్డి దంపతులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేసి దీక్షకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గోదావరిఅంజిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగులకు పే రివిజన్‌  చే యకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచుతుందన్నారు.  రానున్న  ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బుద్దిచెప్పడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భిక్షపతి, సంజీవ, భాస్కర్‌, మల్లేష్‌, రాజు, నవీన్‌, శేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:57:22+05:30 IST