ప్రమాదవశాత్తు వాగులో పడి రైతు మృతి
ABN , First Publish Date - 2020-12-30T05:30:00+05:30 IST
వాగులో బోరుమోటారును దించబోయి ప్రమాదవశాత్తు అందులో పడి రైతు మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గజ్వేల్, డిసెంబరు 30: వాగులో బోరుమోటారును దించబోయి ప్రమాదవశాత్తు అందులో పడి రైతు మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాసాన్‌పల్లి మల్లయ్య(50) తన భూమిలో వేసిన పంటకు నీళ్లు పెట్టడానికి వాగులో మోటార్‌ను దించే ప్రయత్నం చేశారు. ప్రమాదవశాత్తు అందులో పడి పడి మృతిచెందాడు. ఈ విషయమై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.