టీఆర్‌ఎస్ పతనం మొదలైంది
ABN , First Publish Date - 2020-12-11T05:50:51+05:30 IST
టీఆర్‌ఎస్ పతనం మొదలైంది
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి
హత్నూర, డిసెంబరు 10 : టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పతనం మొదలైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బోర్పట్ల గ్రామానికి చెందిన తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గునుకుంట్ల కమలాకర్ తన అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నరేందర్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడంతో పాటు ప్రజాగ్రహానికి గురవుతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహేష్, బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ ప్రధాన కార్యదర్శి హన్మంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ తదితరులు పాల్గొన్నారు.