గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ABN , First Publish Date - 2020-12-30T05:36:47+05:30 IST
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.

బెజ్జంకి, డిసెంబరు 29: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో మైత్రి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైత్రి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, గ్రామస్థులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ నిర్మల, సర్పంచులు కరివేద విజయలక్ష్మి, సీతాలక్ష్మి, మండల కో ఆప్షన్ మెంబర్ మహిపాల్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, టీఆర్‌ఎ్‌సనాయకులు పాల్గొన్నారు.