కాంగ్రెస్ తోనే పేదల అభివృద్ధి
ABN , First Publish Date - 2020-12-29T05:17:23+05:30 IST
పేదల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రె్‌సతోనే సాధ్యమని జహీరాబాద్ మాజీ ఎంపీ సురే్‌షషెట్కార్ అన్నారు.

మాజీ ఎంపీ సురే్‌ష షెట్కార్
నారాయణఖేడ్, డిసెంబరు 28 : పేదల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రె్‌సతోనే సాధ్యమని జహీరాబాద్ మాజీ ఎంపీ సురే్‌ష షెట్కార్ అన్నారు. సోమవారం ఖేడ్‌లో కాంగ్రెస్ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేడ్కర్, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆనంద్‌స్వరూప్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు వివేకానంద్, నర్సింహులు, తాహేర్‌అలీ, బాల్‌కిషన్, హన్మంతు పాల్గొన్నారు.
పటాన్‌చెరు : కాంగ్రెస్ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పటాన్‌చెరులో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తేవడమే కాకుండా 48 ఏళ్లపాటు దేశాన్ని పాలించి అన్నిరంగాల్లో ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత కాంగ్రె్‌సకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, చిన్నముదిరాజ్, సామయ్య, యాదగిరి, గాలయ్య, కుమార్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా కాంగ్రె్‌సకే ఉన్నదని ఎంపీపీ రవీందర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్‌రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీపీ ఉపాధ్యక్షుడు గంగు రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.