అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-27T05:37:43+05:30 IST

అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని బోర్పట్ల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి


హత్నూర, డిసెంబరు 26: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని బోర్పట్ల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. మండల కేంద్రమైన గుమ్మడిదలకు చెందిన కసాల సంజీవ (30) ఆరేళ్ల క్రితం గ్రామానికి చెందిన కాసాల మీనా ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అయితే వారి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్నట్టుండి శుక్రవారం రాత్రి సంజీవ ఇంట్లో నురుగులు కక్కుతూ... అంతలోనే మృతి చెందినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా సంజీవ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మృతుడి అన్న లింగం ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. శవ పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-27T05:37:43+05:30 IST