కన్నతల్లిని గొంతు నులిమి చంపిన కూతురు

ABN , First Publish Date - 2020-12-28T05:05:21+05:30 IST

తాగడానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లిని కూతురు గొంతు నులిమి హత్య చేసిన ఘటన మండలంలోని హదనూర్‌ గ్రామంలో జరిగింది.

కన్నతల్లిని గొంతు నులిమి చంపిన కూతురు

న్యాల్‌కల్‌, డిసంబర్‌ 27:  తాగడానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లిని కూతురు గొంతు నులిమి హత్య చేసిన ఘటన మండలంలోని హదనూర్‌ గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ విజయరాజు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వడ్డెర సోనమ్మ(70)కు కూతరు ఇందిర ఉంది. ఇందిరకు పెళ్లి చేసి, ఇల్లరికం తెచ్చుకుంది. కాగా తాగుడుకు బానిసైన ఇందిర కల్లు తాగడానికి తరచూ డబ్బు కావాలని తల్లి సోనమ్మను వేధించేది. శనివారం రాత్రి ఇందిర  కల్లు తాగడానికి తల్లిని డబ్బు అడగడంతో విసిగిపోయిన సోనమ్మ తన దగ్గర డబ్బు లేదని కరాఖండిగా చెప్పింది. దీంతో కోపొద్రిక్తురాలైన ఇందిర తన తల్లి సోనమ్మను గొంతు నులిమి హత్య చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయరాజు తెలిపాడు.


Updated Date - 2020-12-28T05:05:21+05:30 IST