సన్నాలను కొంటేనే కేంద్రాన్ని తెరవాలి
ABN , First Publish Date - 2020-11-21T06:08:51+05:30 IST
సన్న వడ్లను కొనాలని లేదంటే కొనుగోలు కేంద్రాన్ని తెరువొద్దని డిమాండ్ చేస్తూ మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం కొనుగోళ్లను నిలిపివేశారు.

లింగాపూర్‌లో రైతుల నిరసన
నారాయణఖేడ్, నవంబరు 20: సన్న వడ్లను కొనాలని లేదంటే కొనుగోలు కేంద్రాన్ని తెరువొద్దని డిమాండ్ చేస్తూ మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం కొనుగోళ్లను నిలిపివేశారు. లింగాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొందరు రైతుల వడ్లు కొనుగోలు చేశాక మిగిలిన రైతులవి కొనడం ఆపేశారు. దీంతో శక్రవారం కొనుగోళ్లను అడ్డుకున్నారు. అధికారులు చెప్పడంతోనే గ్రామంలో 150 మంది రైతులు 300 ఎకరాల వరకు సన్న రకం వడ్లను సాగు చేశారు. కేవలం 20 ఎకరాల్లోపే దొడ్డురకం వడ్లను సాగు చేశారు. సన్నరకం సాగుతో దిగుబడి తగ్గిందని, కొనుగోళ్లు కూడా చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లను చెన్నీ (జల్లెడ) పట్టి తీసుకొస్తే ఏ గ్రేడ్ రకంగా కొంటామని, ప్రస్తుతం కొనుగోళ్లు నిలిచి పోయాయని కేంద్రం ఇన్‌చార్జి సుందర్‌లాల్ తెలిపారు.