సమాజమే కేంద్రంగా కవిత్వం రావాలి

ABN , First Publish Date - 2020-03-02T11:23:34+05:30 IST

సమాజం, మనిషి, మానవత్వం కేంద్రంగా కవిత్వం రావాలని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం సూచించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన వెన్నెల సాహితీ

సమాజమే కేంద్రంగా కవిత్వం రావాలి

  • వెన్నెల సాహితీ సంగమంలో కవి జూకంటి జగన్నాథం

సిద్దిపేట: సమాజం, మనిషి, మానవత్వం కేంద్రంగా కవిత్వం రావాలని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం సూచించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన వెన్నెల సాహితీ సంగమం వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక ప్రయోజనం లేని కవిత్వం ఎక్కువ కాలం నిలబడదనిచెప్పారు. సామాజిక ఉద్యమాల్ని ముందుకు నడిపించింది కవిత్వమేనన్నారు. సమాజంలోని కుదుపుల్నీ, సంక్షోభాల్ని ఎప్పటికప్పుడుఅవగాహన చేసుకుంటూ రచనలు చేయాలన్నారు. కవులు తమ బాధ్యతను మరిచి స్వప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం ప్రమాదకరమన్నారు. కవి కొమురవెల్లి అంజయ్య మాట్లాడుతూ భిన్నమైన అభిప్రాయాలున్న కవులు సమూహాలుగా విడిపోవడం తగదన్నారు. అనంతరం పర్కపెల్లి యాదగిరి వచన కవితా సంపుటి ‘సమిథుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వెన్నెల సాహితీ ప్రతినిధులు రామచందర్‌రావు, గాలిరెడ్డి, వంగర నరసింహారెడ్డి, మోర మోహన్‌, రాగిచెట్టు మహేశ్‌, అశోక్‌, రాజు, మహమూద్‌ పాషా, మహేందర్‌రెడ్డి, గంగాపురం శ్రీనివాస్‌, అశోక్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:23:34+05:30 IST