పన్ను కట్టలేదని భవనం ముందే చెత్త

ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST

మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు చెల్లించక పోవడంతో మున్సిపల్‌ సిబ్బంది మంగళవారం పన్ను కట్టని వారి భవనం ఎదుట చెత్తను వేశారు.

పన్ను కట్టలేదని భవనం ముందే చెత్త
మున్సిపాలిటీకి పన్ను కట్టనందుకు ఖేడ్‌లో భవనం ఎదుట చెత్త వేయిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

నారాయణఖేడ్‌, డిసెంబరు 15: మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు చెల్లించక పోవడంతో మున్సిపల్‌ సిబ్బంది మంగళవారం పన్ను కట్టని వారి భవనం ఎదుట చెత్తను వేశారు. నారాయణఖేడ్‌ పట్టణానికి చెందిన నారాయణ, మహేష్‌ ఇంటి పన్ను కట్టకపోవడంతో మున్సిపల్‌ సిబ్బంది వాహనాల ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులో కాకుండా వారి భవనం ఎదుట వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ సిబ్బంది మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లించి సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-12-15T05:30:00+05:30 IST