పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2020-12-27T05:36:58+05:30 IST

బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
బీజేపీలో చేరిన నాయకులతో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి

సిద్దిపేట క్రైం, డిసెంబరు 26 : బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని 31వ వార్డుకు చెందిన 20 మందికిపైగా యువకులు శనివారం పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి కాషాయం జెండా ఎగర వేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అండర్‌ డ్రైనేజీ పనుల మూలంగా ధ్వంసమైన సీసీ రోడ్లను వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురే్‌షగౌడ్‌, గుండ్ల జనార్ధన్‌, పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, మీడియా సెల్‌ జిల్లా కన్వీనర్‌ గోనె మార్కండేయులు, శ్రీకాంత్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:36:58+05:30 IST