నాచగిరి క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-28T05:30:00+05:30 IST

వర్గల్‌, డిసెంబరు 28 : వర్గల్‌ మండల నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

నాచగిరి క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు
నాచగిరిలో స్వామివారికి విశేష అభిషేకాలు చేస్తున్న వేద పండితులు

వర్గల్‌, డిసెంబరు 28 : వర్గల్‌ మండల నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం దేవతామూర్తులకు, నమ్మాళ్వార్లకు విశేష పంచామృతాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహాణాధికారి కట్టసుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు  చేశారు.  వేడుకలకు భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. 

చేర్యాల, డిసెంబరు 28: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్‌  చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్‌ పుష్ప, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి తదితరులు సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట సెవెల్లి సంపత్‌, తూముకుంట అరుణ్‌కుమార్‌, బండారు నారాయణ, దేవర రాజేశ్వర్‌, కొలుపుల నర్సింహా ఉన్నారు. 

Updated Date - 2020-12-28T05:30:00+05:30 IST