ఉపాధ్యాయుల అరెస్టును ఖండిస్తున్నాం
ABN , First Publish Date - 2020-12-30T05:59:01+05:30 IST
పెద్దశంకరంపేట, డిసెంబరు 29: పదోన్నతులు, బదిలీల సాధన కోసం హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మహాధర్నాకు తరలి వెళ్లకుండా ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు

ఎస్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్
పలుచోట్ల అరెస్టులు
పెద్దశంకరంపేట, డిసెంబరు 29: పదోన్నతులు, బదిలీల సాధన కోసం హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మహాధర్నాకు తరలి వెళ్లకుండా ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టులను ఖండిస్తున్నామని జిల్లా ఎస్టీయూ మాజీ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ఉద్యమాలను అణచి వేయడానికి ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. శ్రీనివా్‌సతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కుమార్, ఆనంద్, రమేష్, విజయ్‌కుమార్, సవిత, హరి, రూప్‌సింగ్, ప్రవీణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నశంకరంపేట: ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు పోచయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్యనారాయణ, ప్రతాప్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
నర్సాపూర్: టీఎ్‌సయూటీఎఫ్ నాయకులు సుదర్శన్, సామ్యానాయక్, గణేష్, రమేష్, నాగుల్‌మీరా, రవిరాజు, శ్రీహరి, అప్పలనాయుడు, రాజు, రాంబాబు, రాములు, భాస్కర్, తిరుపతి, శ్రీనివాస్, రములు, నాయుడు తమహాధర్నాకు తరలి వెళ్లారు.
వెల్దుర్తి: ఐక్య ఉపాధ్యాయ సమితి మం డల నాయకులు వెంకటేశం, రామగౌడ్, భాస్కర్, రమేశ్‌గౌడ్‌ను అరెస్టు చేశారు.
తూప్రాన్: తూప్రాన్‌లో జాక్టో నాయకులు గడీల సుధాకర్, మధునాల రమేశ్, వి.రమేశ్, బి.కిష్టయ్య, వి.శ్రీనివాస్, డి.వెంకటేశ్, అశోక్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
చేగుంట: ఉపాధ్యాయ సంఘం నాయకులు జగన్‌లాల్, నర్సింహులు, సుధాకర్ ధర్నాకు తరలివెళ్లారు.
మెదక్: నిరసన ప్రదర్శనకు రాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చి ధర్నాకు వస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టని టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ మండిపడ్డారు. మెదక్ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో అరెస్టు అయిన ఉపాధ్యాయ సంఘ నాయకులను పరామర్శించి మాట్లాడారు. ఆయనవెంట పీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్ శేఖర్, సుం కయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, భరత్‌గౌడ్, నాగిరెడ్డి, సల్మాన్, లడ్డూ, ఆదిల్, వెంకటే్‌షగౌడ్ ఉన్నారు.