కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ABN , First Publish Date - 2020-03-21T11:05:10+05:30 IST

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సిట్టింగ్‌ టేబుళ్లనురోజూ శుభ్రపరిచేలా చర్యలు

కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

  • ‘పది’ పరీక్ష కేంద్రాల సందర్శనలో కలెక్టర్‌ ధర్మారెడ్డి


చేగుంట, మార్చి 20: విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సిట్టింగ్‌ టేబుళ్లనురోజూ శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. చేగుంట మండలంలోని వడియారం, చేగుంటలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం పరిశీలించి  విద్యార్థులకు కావలసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు కరోనా వైరస్‌ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కరోనా వైరస్‌ నిర్ములనకు జన సంచారం ఉన్న చోట ఉండొద్దని, అవసరం లేనిదే ఇంటి నుంచి బయటకు రావొద్దని కలెక్టర్‌ సూచించారు. ఆయనవెంట డీపీవో హనూక్‌ ఉన్నారు.

Updated Date - 2020-03-21T11:05:10+05:30 IST