మహిళలను ఇబ్బంది పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-12-28T04:39:34+05:30 IST

మహిళలను, యజమానులను అపార్టుమెంట్‌లో ఉంటున్న ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని కపిల్‌ కౌసల్య మెంబర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేశారు.

మహిళలను ఇబ్బంది పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
వినతిపత్రాన్ని చూపుతున్న అపార్ట్‌మెంట్‌ వాసులు

సంగారెడ్డి క్రైం, డిసెంబరు 27 : మహిళలను, యజమానులను అపార్టుమెంట్‌లో ఉంటున్న ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని కపిల్‌ కౌసల్య మెంబర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బీ.వీ.శివశంకర్‌రావు, జీ.రాజుగౌడ్‌, అపార్ట్‌మెంట్‌ యజమానులు మాట్లాడుతూ ఎండీ అమీరొద్దీన్‌ కొన్నినెలలుగా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని కపిల్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ రిజిస్ర్టేషన్‌ కాకుండానే దౌర్జన్యంగా ఉంటున్నాడన్నారు. 304 నంబరు ఫ్లాట్‌కు చెందిన బంధువులు శనివారం రాత్రి ఫ్లాట్‌ నంబరు 302కు చెందిన ఖాళీ స్థలంలో కారును పార్కింగ్‌ చేశారన్నారు. అదే సమయంలో అమీరొద్దీన్‌ అక్కడికొచ్చి ఆ కారు పార్కింగ్‌ తనదని, ఎవరూ పెట్టుకోవద్దని దుర్భాషలాడాడని ఆరోపించారు. ప్రతిరోజు 12 గంటలు దాటిన తర్వాత మద్యం సేవించి కారును మెయిన్‌ గేట్‌కు అడ్డంగా పెట్టి ఉదయం 11 గంటల తర్వాతనే తీస్తున్నాడన్నారు. ఎవరైనా ఇదేంటని అడిగితే వారిపై దౌర్జన్యం చేస్తున్నాడని పేర్కొన్నారు. అమీరొద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్‌ కోశాధికారి వీ.భాస్కర్‌, హెచ్‌.శంకర్‌, లక్ష్మయ్య, వై.శంకర్‌, అభిషేక్‌, శ్రీశైలం, సత్యనారాయణ, దత్తు, జగన్‌రెడ్డి, జయశ్రీ, సంపూర్ణ, మాధురి, శ్రీధర్‌, పీ.సతీ్‌షకుమార్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-28T04:39:34+05:30 IST