సీఎంను కలిసిన సునీతాలక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-12-29T06:00:11+05:30 IST

రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియామకమైన సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంను కలిసిన సునీతాలక్ష్మారెడ్డి

నర్సాపూర్‌, డిసెంబరు 28: రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియామకమైన సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని సునీతాలక్ష్మారెడ్డి స్వగ్రామమైన గోమారంలో ఆమె ఇంట్లో సోమవారం నిర్వహించిన అయ్యప్పమహాపడి పూజ కార్యక్రమం ముగిశాక హైదరాబాద్‌లోని  ప్రగతిభవన్‌కు వెళ్లారు. సీఎంను కలిసి శాలువ కప్పి పుష్పంగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. 


Updated Date - 2020-12-29T06:00:11+05:30 IST