ఒంటరి జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-19T06:03:18+05:30 IST

ఒంటరి జీవితంపై విరక్తితో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేర్యాలలో శుక్రవారం జరిగింది.

ఒంటరి జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

చేర్యాల, డిసెంబరు 18 : ఒంటరి జీవితంపై విరక్తితో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేర్యాలలో శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన ముస్త్యాల సిద్ధయ్య(85) భార్య కొన్న సంవత్సరాల క్రితం మృతిచెందింది. కుమారులు ఇద్దరు హైదరాబాద్‌లో తమ కుటుంబాలతో ఉంటున్నారు. చేర్యాలోనే ఒంటరిగా ఉంటున్న సిద్ధయ్యకు జీవితంపై విరక్తి కలిగి, శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై కుమారుడు సహదేవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read more