కంగ్టి సరిహద్దుల్లో చెక్‌ పోస్టు

ABN , First Publish Date - 2020-03-21T10:59:10+05:30 IST

కర్ణాటక, మహారాష్ట్రల్లో కరోనావైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో కంగ్టి మండల సరిహద్దుల్లోని దెగుల్‌వాడీ వద్ద శుక్రవారం అధికారులు స్ర్కీనింగ్‌ చెక్‌ పోస్టును

కంగ్టి సరిహద్దుల్లో చెక్‌ పోస్టు

 ముమ్మరంగా వాహనాల తనిఖీ 


కంగ్టి, మార్చి 20 :  కర్ణాటక, మహారాష్ట్రల్లో కరోనావైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో కంగ్టి మండల సరిహద్దుల్లోని దెగుల్‌వాడీ వద్ద శుక్రవారం అధికారులు స్ర్కీనింగ్‌ చెక్‌ పోస్టును ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో  కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున అక్కడి నుంచి మండలంలోకి వస్తున్న వారికి, వాహనాలలోని వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్‌ నాగరాజు, ఎస్‌ఐ అబ్దుల్‌ రఫీక్‌, వైద్యాధికారులు మనోహర్‌రెడ్డి, నారాయణరావు, సంగమ్మ, తదితరులు స్ర్కీనింగ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-03-21T10:59:10+05:30 IST