శ్రీకాంతాచారికి ఘననివాళి

ABN , First Publish Date - 2020-12-04T05:39:33+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసిన తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం

శ్రీకాంతాచారికి ఘననివాళి
మెదక్‌లో శ్రీకాంత్‌చారికి నివాళులర్పిస్తున్న వేదాస్‌ అసోసియేషన్‌ సభ్యులు

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 3: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసిన తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం మెదక్‌లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర వేదాస్‌ అసోసియోషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వత్తులను వెలగించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్‌చారి ఆత్మబలిదానాన్ని ప్రజలు ఎన్నటికీ మరువబోరని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఉద్యమం ఉధృతమయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సంగయ్య, జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్‌, ఉపఽధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు యాదగిరి సభ్యులు కుమార్‌, వెంకటేశ్వర్లు, విశ్వబ్రహ్మణ మాజీ అధ్యక్షులు బ్రహ్మయ్యచారి, మెదక్‌ ప్రెస్‌క్లబ్‌ శంకర్‌ దయాళ్‌చారి, శ్రీనివా్‌సచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:39:33+05:30 IST