ట్యాంక్‌బండ్‌ పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2020-03-02T11:18:33+05:30 IST

సదాశివపేట పట్టణంలోని ఊబ చెరువు కట్టపై రూ.6 కోట్లతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను ఆదివారం అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా పరిశీలించారు.

ట్యాంక్‌బండ్‌ పనుల్లో వేగం పెంచాలి

  • కట్టపై గ్రీనరీ ఉండేలా చూడాలి
  • అధికారులకు అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశాలు

సదాశివపేట: సదాశివపేట పట్టణంలోని ఊబ చెరువు కట్టపై రూ.6 కోట్లతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను ఆదివారం అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌ బండ్‌పై బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేలా రెండు వైపులా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్లాదకరంగా ఉండేలా చెరువు కట్టపై గ్రీనరీ, కూర్చునేందుకు వీలుగా బల్లలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గజ్వేల్‌ తరహాలో ట్యాంక్‌ బండ్‌ను అన్ని కోణాల్లో ఎలాంటి రాజీ లేకుండా సుందరీకరించాలని కోరారు. మినీ ట్యాంక్‌ బండ్‌ ప్రాంతంలో ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లోడి జయమ్మ, వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథ్‌, సమీ, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, ఇంజనీర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-03-02T11:18:33+05:30 IST