కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-12-20T05:12:13+05:30 IST
కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరు తూ శనివారం హైదరాబాద్‌లోని ఎక్సైజ్ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ నివాసంలో కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

సంగారెడ్డి రూరల్/నారాయణఖేడ్, డిసెంబరు 19 : కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరు తూ శనివారం హైదరాబాద్‌లోని ఎక్సైజ్ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ నివాసంలో కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేజీకేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆశన్నగౌడ్, రమే్‌షగౌడ్ మాట్లాడుతూ ఎక్సైజ్ చట్టంలో కల్లు గీత వృత్తి కి గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసే అంశాలను తొలగించి అర్హులైన కల్లు గీత కార్మికులకు న్యాయం చేయాలని, సొసైటీలో కొత్త సభ్యత్వాలను ఇవ్వాలని కోరారు. తాటి చెట్ల పంపెకానికి ఇచ్చిన భూమి హద్దులు చూపాలని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, సభ్యులు జంగన్నగౌడ్, శ్రీనివా్‌సగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, బాలకృష్ణగౌడ్, మల్లేశం గౌడ్, జంగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.