మాతోనే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2020-09-12T09:55:11+05:30 IST

చేనేత కార్మికుల కష్టసుఖాలు తెలిసింది తమకేనని, తెలంగాణ ఉద్యమం ద్వారానే చేనేతల కష్టాలు ప్రపంచానికి వెలుగు చూశాయని

మాతోనే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి


దుబ్బాక, సెప్టెంబరు 11: చేనేత కార్మికుల కష్టసుఖాలు తెలిసింది తమకేనని, తెలంగాణ ఉద్యమం ద్వారానే చేనేతల కష్టాలు ప్రపంచానికి వెలుగు చూశాయని మెదక్‌ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాక ప్రాంతంపై, ఇక్కడి చేనేత కార్మికులపై ఇక్కడ పెరిగిన బిడ్డగా సీఎం కేసీఆర్‌కు ఉన్న కడుపునొప్పి మరేవరికీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన దుబ్బాకలో చేనేత కార్మికుల రీలే దీక్ష శిబిరాన్ని సందర్శించి, దీక్ష విరమింపజేశారు. కార్మికులు లేవనెత్తిన పలు డిమాండ్లను శిబిరం నుంచే అధికారులతో మాట్లాడి, పలు డిమాండ్లను పరిష్కరించేందుకు ఆదేశాలిచ్చారు. చేనేత కార్మికులకు బకాయిలను తమ ప్రభుత్వమే మాఫీ చేసిందని పేర్కొన్నారు. కార్మికులు బ్యాంక్‌ మెట్లు కూడా ఎక్కకుండానే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో సంక్షోభం నుంచి క్రమంగా బయటపడుతున్నారని తెలిపారు.


కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని సిరిసిల్ల, దుబ్బాక చేనేతల సమస్యల నుంచే ఉధృతం చేశారన్నారు. అంచలవారీగా చేనేత బతుకు మార్చాలనే తపనతో మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావు తాపత్రయపడుతున్నారన్నారు. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి సొంతంగా రూ. 10 లక్షలను అందించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్‌.రాజమౌళి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలా్‌సముదిరాజ్‌, అధికం బాలకిషన్‌గౌడ్‌, బీమసేనా, పల్లె రామస్వామిగౌడ్‌, బండిరాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు జిందం గాలయ్య,  సత్యానందం, కారంపురి రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-12T09:55:11+05:30 IST