కూలిన వాటర్ ట్యాంక్ స్లాబ్.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-11-27T05:17:19+05:30 IST
కట్టెచెక్కలు, మిల్లర్ ఊడి ఎత్తు నుంచి ట్యాంకు కింద కంకర ఎత్తుతున్న మల్లయ్యపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

దుబ్బాక, నవంబరు 26: తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన వడ్డె మల్లయ్య(50) పోతరెడ్డిపేటలో డబుల్ బెడ్రూం కాలనీ వద్ద చేపడుతున్న వాటర్ ట్యాంకు నిర్మాణంలో కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సెంట్రింగ్ కూలడంతో దానిపైన ఉన్న ప్రభాకర్ అనే కూలీ కిందపడి గాయాలపడ్డాడు. కట్టెచెక్కలు, మిల్లర్ ఊడి ఎత్తు నుంచి ట్యాంకు కింద కంకర ఎత్తుతున్న మల్లయ్యపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన ప్రభాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మల్లయ్య బంధువులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. మృతుడికి భార్య పోశవ్వ, ఇద్దరు కుమారులు కిషన్, కరుణాకర్ ఉన్నారు.