పది విడతలుగా సాగుకు సింగూరు జలాలు

ABN , First Publish Date - 2020-12-15T05:42:31+05:30 IST

ఘణపూర్‌ ఆయకట్టు కింద 25 వేల ఎకరాలకు జనవరి 10 నుంచి పది విడతలుగా సాగునీరందిస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి నీటి పారుదల సలహా కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

పది విడతలుగా సాగుకు సింగూరు జలాలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, పక్కన ఎమ్మెల్యే పద్మారెడ్డి

మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


మెదక్‌ రూరల్‌, డిసెంబరు 14: ఘణపూర్‌ ఆయకట్టు కింద 25 వేల ఎకరాలకు జనవరి 10 నుంచి పది విడతలుగా సాగునీరందిస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో మెదక్‌  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి నీటి పారుదల సలహా కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఘణపూర్‌ ఆయకట్టు పరిధిలోని మెదక్‌, కుల్చారం, పాపన్నపేట, హవేళిఘణపూర్‌ మండలాల్లోని 40 గ్రామాల రైతులకు యాసంగికి సాగునీరందిస్తామని తెలియజేశారు. రైతుబంధు గామ్ర అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి అవగాహన సమావేశాలను నిర్వహించి 8 నుంచి 10 విడతలుగా జనవరి 10 నుంచి సింగూరు జలాలలను అందిస్తామని చెప్పారు. దానికి అనుగునంగా రైతులు విత్తు నాటే సమయం నుంచి పంట కోత కోసే వరకు ప్రణాళికలు రూపొందించుకునేలా వారిలో అవగాహన కల్పించాలని వ్యవయశాఖ అధికారులను ఆదేశించారు. మెదక్‌ మున్సిపాలిటీలో సుమారు 70 వేల జనాభా ఉన్నారని, రూ.65 కోట్ల వ్యయంతో మిషన్‌ భగీరథ ద్వారా మార్చి నాటికి 32 వార్డుల్లో ప్రజలకు తానునీటిని అందించేందుకు శరవేగంగా పనులను నిర్వహిస్తున్నారని తెలిపారు. పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌కు ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పారు. జిల్లాలో 5,235 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని, 1,537 ఇల్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సాయింరాం, శ్యాం ప్రకాష్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-15T05:42:31+05:30 IST