సింగూరు ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 42036 క్యూసెక్కులు
ABN , First Publish Date - 2020-10-16T12:14:00+05:30 IST
సింగూరు ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 42036 క్యూసెక్కులు
సంగారెడ్డి: భారీ వర్షాల కారణంగా సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సింగూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ మట్టం 28.776 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వరద నీటి ఇన్ ఫ్లో 42036 క్యూసెక్కులు చేరుతోంది. అలాగే ప్రాజెక్టు నుండి నీటి ఔట్ ఫ్లో 42036 క్యూసెక్కులుగా ఉంది. సింగూర్ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్ఎల్ 523.600 మీటర్లకు గాను.. ప్రస్తుతం 522.570 మీటర్లుగా నమోదు అయ్యింది.