ఉప ఎన్నికకు ఉపయోగించే వాహనాలకు జియో ట్యాగింగ్
ABN , First Publish Date - 2020-11-03T11:17:37+05:30 IST
ఉప ఎన్నిక మొబైల్ పార్టీ వాహనాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనాలకు జియో ట్యాగింగ్ చేయడంతో జీపీఎస్ ద్వారా వాహనాల కదలికలను గుర్తించవచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ తెలిపారు
సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్
సిద్దిపేట అగ్రికల్చర్, నవంబరు 2 : ఉప ఎన్నిక మొబైల్ పార్టీ వాహనాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనాలకు జియో ట్యాగింగ్ చేయడంతో జీపీఎస్ ద్వారా వాహనాల కదలికలను గుర్తించవచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ తెలిపారు. సోమవారం ఎన్నికల అబ్జర్వర్లు సరోజ్‌కుమార్ ఠాగూర్, సంధ్యారాణి సీపీ జోయల్ డేవిస్‌ను కలిసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీసీటీవీ కంట్రోల్ రూములో జియోట్యాగింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సిద్దిపేట ఐటీ కోర్ సిబ్బందితో ఎన్నిక ముగిసేంత వరకు ప్రతి వాహనం లొకేషన్‌ను తెలుసుకోవడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.