హుస్నాబాద్‌లో షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN , First Publish Date - 2020-12-31T05:29:22+05:30 IST

హుస్నాబాద్‌ పట్టణంలో దివంగత సీఐ యాదగిరి, ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ స్మారక డివిజన్‌ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను బుధవారం రాత్రి ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ ప్రారంభించారు.

హుస్నాబాద్‌లో షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు
షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుతున్న ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

హుస్నాబాద్‌, డిసెంబరు 30: హుస్నాబాద్‌ పట్టణంలో దివంగత సీఐ యాదగిరి, ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ స్మారక డివిజన్‌ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను బుధవారం రాత్రి ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు.  నియోజకవర్గలోని 500 మంది నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మెన్‌ రాజారెడ్డి, ఏసీపీ మహేందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అనిత, నేషనల్‌ లేబర్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి, మద్దూరు జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సీఐ రఘునాథరెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు నళినిదేవి, డాక్టర్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T05:29:22+05:30 IST