సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:35:46+05:30 IST

ఎంపీపీ మానస అధ్యక్షతన శనివారం హుస్నాబాద్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. సన్నాలను కొనుగోలు చేయాలని కోరుతూ పోతారం(ఎస్‌) గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ బత్తిని సాయన్న పోడియం ఎదుట బైఠాయించారు.

సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
పోడియం ఎదుట బైఠాయించిన సభ్యులు

 హుస్నాబాద్‌ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆందోళన


హుస్నాబాద్‌రూరల్‌, డిసెంబరు 5: ఎంపీపీ మానస అధ్యక్షతన శనివారం హుస్నాబాద్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. సన్నాలను కొనుగోలు చేయాలని కోరుతూ పోతారం(ఎస్‌) గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ బత్తిని సాయన్న పోడియం ఎదుట బైఠాయించారు. సర్వసభ్య సమావేశానికి డివిజనల్‌ స్థాయి అధికారులు ఎందుకు హాజరు కావడం లేదని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా వ్యవసాయ, ఐకేపీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిల్లర్లతో సంప్రదింపులు చేయాల్సిన ఆర్డీవో సమావేశానికి హాజరు కావాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎంపీడీవో అనిత, తహసీల్దార్‌ రెహమాన్‌, వైస్‌ ఎంపీపీ దేవసాని నిర్మల పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:35:46+05:30 IST